Skip to main content

ఫేస్‌బుక్‌ ఇప్పుడు ఫిఫ్త్‌ ఎస్టేట్‌...

ఫేస్‌బుక్‌ ఇప్పుడు ఫిఫ్త్‌ ఎస్టేట్‌...

ఫోర్త్‌ ఎస్టేట్‌ అని మనం పిలుచుకునే సంప్రదాయ న్యూస్‌ మీడియాకు దీటుగా ఫిఫ్త్‌ ఎస్టేట్ గా  ఫేస్‌బుక్‌ అవతరించిందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రకటించారు. ప్రజలు తమ స్వరాన్ని వినిపించడానికి న్యూస్‌ మీడియా లేదా రాజకీయ నాయకులపై ఇక ఏ మాత్రం ఆధారపడనవసరం లేదని ఆయన పిలుపునిచ్చారు. వాషింగ్టన్‌లోని జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయంలో ఆయన ఉపన్యసిస్తూ, సోషల్‌ మీడియా అధికారాన్ని నేరుగా ప్రజల చేతికిచ్చిందని అభిప్రాయపడ్డారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగల ప్రజలతో ఒక కొత్త శక్తి అవతరించిందని, అదే ఫిఫ్త్‌ ఎస్టేట్ అని ఆయన విశ్లేషించారు. ఈ విధమైన మార్పు న్యాయం, సంస్కృతి, టెక్నాలజీ తదితర రంగాలలో అనేక అతిముఖ్య పరిణామాలకు దారి తీస్తోందని ఆయన అన్నారు.
ఫేస్‌బుక్‌ ఇప్పుడు ఫిఫ్త్‌ ఎస్టేట్‌...
ఫేస్‌బుక్‌, నిజ నిర్ధారణ చేయకుండానే రాజకీయ ప్రకటనలను అంగీకరించడాన్ని ఆయన సమర్థించారు. ‘‘మేం రాజకీయ ప్రకటనల నిజానిజాల తనిఖీ చేపట్టం. అయితే ఇది రాజకీయ నాయకులకు కొమ్ముకాయడానికి కాదు. ప్రజలు నాయకులు చెప్పేది వినాలి. వారు చెప్పే విషయంలోని అంతరార్థాలు, పరిణామాలను స్వీయ విచక్షణతో అంచనా వేయగలగాలి. మా ప్రమాణాలకు విరుద్ధమైన ఏ వార్తనైనా, అది ఎంత ముఖ్యమైనదైనా సరే, మేం అంగీకరించం...అదేవిధంగా రాజకీయ నాయకుల విషయంలో కూడా హింసాత్మకమైన, ప్రమాదకరమైన అంశాలను మేము ప్రోత్సహించం. ఓటరును అణగదొక్కే ఏ ప్రయత్నానికైనా మేం వ్యతిరేకం. ఓటింగ్‌ అనేది ప్రజల వాణి.’’ అని జుకర్‌బర్గ్‌ అన్నా

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.