ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీ పథకంపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యాంశాలు
- నవంబరు 1 నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు
- పొరుగు రాష్ట్రాల్లో 150 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ
- శస్త్రచికిత్స చేయించుకున్నవారు కోలుకునేంతవరకు నెలకు రూ.5,000 లేదా రోజుకు రూ.225 (డిసెంబరు 1 నుంచి అమలు)
- కిడ్నీ వ్యాది బాధితులకు నెలకు రూ.5,000
- తలసేమియా, హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10,000
- పక్షవాతం, కండరాల క్షీణత, కాళ్లుచేతులు లేనివారికి నెలకు రూ. 5 వేలు పెన్షన్ (జనవరి 1 నుంచి అమలు)
- డెంగ్యూ జ్వరం, ఇతర సీజనల్ వ్యాధులకు ఆరోగ్యశ్రీలో స్థానం
- డబుల్ కాక్లియర్ ఇంప్లాంట్ కు ఆరోగ్యశ్రీలో స్థానం
- కంటి వెలుగు పథకం కాలేజీలకూ వర్తింపు
- డిసెంబరు 21న ఆరోగ్యశ్రీ కార్డుల జారీ
- ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రూ.16 వేలకు పెంపు
- జనవరి 1 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో 2000 వ్యాధులకు ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టు అమలు
- ఇతర జిల్లాల్లో 1200 వ్యాధులకు ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టు అమలు
- బైకుల ద్వారా గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు
- ప్రజలందరికీ కంటి పరీక్షలు
- ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి ఆసుపత్రి
- రోడ్డు ప్రమాద బాధితుల కోసం అత్యవసర నిధి ఏర్పాటు
Comments
Post a Comment