ఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో సీబీఐ శుక్రవారం దిల్లీ కోర్టులో
ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంతో పాటు
మరో 13 మందిని నిందితులుగా పేర్కొంది. ఐఎన్‌ఎక్స్ మీడియాకు విదేశీ నిధులు
సమకూర్చడంలో చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఛార్జిషీట్‌లో
ఆరోపించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో ఆగస్టు 21న
చిదంబరాన్ని అరెస్టు చేసిన సీబీఐ దాదాపు ఎనిమిది వారాల పాటు ఆయన్ను
తిహార్ జైలులో ఉంచి విచారించిన విషయం తెలిసిందే. తాజాగా నగదు అక్రమ చలామణి
నిరోధక చట్టం కింద చిదంబరాన్ని బుధవారం ఈడీ అధికారులు అదుపులోకి
తీసుకున్నారు. గురువారం ఆయన జ్యుడిషియల్ కస్టడీని దిల్లీ కోర్టు అక్టోబర్
24వరకు పొడిగించింది. ఈ ఛార్జి షీట్‌లో చిదంబరంతో పాటు ఐఎన్‌ఎక్స్ మీడియా
అధిపతులు పీటర్ ముఖర్జియా, ఇంద్రాణీ ముఖర్జియా, చిదంబరం కుమారుడు కార్తీ
చిదంబరంతో పాటు మరికొందరి పేర్లను పేర్కొంది.
Comments
Post a Comment