అభివృద్ధి చెందతున్న దేశాలు' అంటూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో)
ఇచ్చిన ట్యాగ్ ను అనుకూలంగా మలుచుకుని ఇండియా, చైనాలు తమపై అడ్వాంటేజ్
తీసుకుంటున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఈ
రెండు దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణిస్తున్న నేపథ్యంలో
డబ్ల్యూటీవోకు తాము లేఖరాశామని చెప్పారు. వీటిని అభివృద్ధి చెందుతున్న
దేశాలుగా తాము పరిగణించమని స్పష్టం చేశారు.
అమెరికా, చైనాల మధ్య
ట్రేడ్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిపిందే. మరోవైపు, తమ ఉత్పత్తులపై ఇండియా
భారీగా పన్ను వేస్తోందని ఇప్పటికే ట్రంప్ పలుమార్లు విమర్శించారు. ఈ
నేపథ్యంలోనే, రెండు దేశాలపై ట్రంప్ మరోసారి ధ్వజమెత్తారు. ఈ రెండు దేశాలు
భరించలేనివిగా తయారయ్యాయని మండిపడ్డారు.
Comments
Post a Comment