Skip to main content

50 అడుగుల లోతులో బోటు: ధర్మాడి సత్యం

 





తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట బోటు వెలికితీత పనుల్లో ధర్మాడి సత్యం బృందం పురోగతి సాధించిన విషయం తెలిసిందే. నిన్న బోటు రెయిలింగ్‌ను బయటకు తీసిన ఆ బృందం తమ ప్రయత్నాలను ఈ రోజు కూడా కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా ధర్మాడి సత్యం మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలు తెలిపారు. 50 అడుగుల లోతులో రాయల్ వశిష్ట బోటు ఉన్నట్లు వెల్లడించారు. ఈ రోజు విశాఖపట్నం నుంచి కొందరు డైవర్లు వస్తారని తెలిపారు.

కాగా, కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్ ఆది నారాయణ ఆధ్వర్యంలో బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. గత నెల కచ్చులూరు వద్ద ఈ బోటు మునిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 38 మృతదేహాలు లభ్యం కాగా మరో 13 మంది ఆచూకీ గల్లంతైంది. దేవుడిగొంది ఇసుక తిన్నె వద్ద ఒడ్డు నుంచి 200 మీటర్ల దూరంలో బోటు ఉన్నట్లు గుర్తించారు.   

Comments