Skip to main content

విశాఖ భూ కుంభకోణంలో చంద్రబాబు, లోకేశ్ లే ప్రధాన సూత్రదారులు: వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ ఆరోపణ

విశాఖపట్టణం భూ కుంభకోణంలో ప్రధాన సూత్రదారులు చంద్రబాబునాయుడు, లోకేశ్ లేనని వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ ఆరోపించారు. ఈ కుంభకోణం వ్యవహారంపై సిట్ నివేదిక బయటపెట్టమని గత ప్రభుత్వాన్ని ప్రతిపక్ష హోదాలో తాము డిమాండ్ చేసినా పట్టించు కోలేదని విమర్శించారు. ఆరు లక్షల గజాల ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలకు దోచిపెట్టారని ఆరోపించారు.

ఈ కేసుకు సంబంధించి సిట్ నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తుందని చెప్పారు. ఈ కుంభకోణంలో వైసీపీ నేతల పేర్లున్నట్టు ప్రచారం చేశారని, ఇందులో ఎవరి పాత్ర ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖ భూముల పరిరక్షణకు సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని అన్నారు. సిట్ ముందుకు ప్రజలు రావాలని, వారికి జరిగిన అన్యాయంపై ఫిర్యాదులు చేయాలని కోరారు.   

Comments