Skip to main content

నువ్వు చెలాయించిన అధికారంలో మేం వీసమెత్తు కూడా చెలాయించడంలేదే!: చంద్రబాబుపై బొత్స ఫైర్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎదురుదాడికి దిగారు. అనుభవం ఉందని చెప్పుకోవడం కాకుండా, ఏదైనా అంశంలో తప్పు జరిగిందని చెబితే సరిదిద్దుకుంటామని, అంతేతప్ప జరిగినవీ, జరగనివీ అన్నింటికి ముడిపెట్టి లబ్దిపొందాలని చూడడం సబబు కాదని హితవు పలికారు. "ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు అమాయకులనుకుంటున్నావా నువ్వు? తప్పు తప్పు! నీలో ఏదైనా గౌరవం మిగిలుంటే కనీసం అదైనా దాచుకోవడానికి ప్రయత్నించు" అంటూ వ్యాఖ్యానించారు.

"నువ్వు ఎంత అధికారం చెలాయించి ఉంటావు, దాంట్లో కనీసం వీసమెత్తు అయినా మేం చెలాయించి ఉంటామా చెప్పండి!" అంటూ అడిగారు. "నువ్వు చెలాయించిన అధికారంతో పోలిస్తే మేం పది శాతం కూడా చెలాయించడంలేదు. ఆ విధంగా మేమూ చేస్తే నువ్వు భరించలేవేమో!" అంటూ విమర్శించారు.

"నీ జులుం కానీ, నీ అహంభావం కానీ, నీ పార్టీ నేతలను, కార్యకర్తలను నువ్వు పెట్టే హింసలు కానీ, అవమానాలు కానీ మేం వీసమెత్తు కూడా చేయడంలేదే! దేనికోసం నీ ఆక్రోశం!" అంటూ బొత్స తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబునాయుడు ఇటీవల ప్రభుత్వ విధానాలను సునిశితంగా విమర్శిస్తున్న నేపథ్యంలో బొత్స కాస్త ఘాటుగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.