రిజిస్టేషన్ ఫీజు చెల్లించకుండా, తాత్కాలిక రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలను
విక్రయిస్తున్న గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్ కు ఏపీ రవాణా శాఖ జరిమానా
విధించింది. ఈ విధంగా సదరు షోరూమ్ 576 వాహనాలు విక్రయించినట్టు రవాణాశాఖ
విచారణలో గుర్తించింది. ప్రభుత్వానికి రూ.41 లక్షల పన్నులు ఎగవేసినట్టు
అధికారుల లెక్కలో తేలింది. ఈ నేపథ్యంలో గౌతమ్ షోరూం యజమానికి కోటి రూపాయల
జరిమానాను రవాణా శాఖ కమిషనర్ విధించారు. ఇంత మొత్తంలో జరిమానా విధించడం
రవాణా శాఖ చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. గుంటూరు
జిల్లాలోని మరో 7 షోరూమ్ లకు రూ.39 లక్షల మేరకు జరిమానాలు విధించినట్టు
సమాచారం. కాగా, కోటి రూపాయల జరిమానాను గౌతమ్ హీరో షోరూమ్ చెల్లించింది.
Comments
Post a Comment