Skip to main content

అభివృద్ధి, ఆదాయాల్లేవు.. ఖర్చు మాత్రం ఇష్టానుసారం..: చంద్రబాబు

రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున లూటీ చేస్తూ.. ప్రతిపక్ష నేతలను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తామేం చేసినా రాయటానికి వీల్లేదన్నట్లు మీడియాని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు లేకపోయినా ప్రజలను మోసం చేసేందుకు ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాల్లో లబ్దిదారుల సంఖ్య గణనీయంగా తగ్గించేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అర్హులకు ప్రయోజనం దక్కకుండా చేస్తున్నారన్నారు.
అసమర్థతతో ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి.. గత ప్రభుత్వ తప్పిదం అంటూ తమపై నిందలు మోపుతున్నారన్నారు. తెలుగుదేశం 5ఏళ్ల పాలన మొత్తం అవినీతిమయం ఆరోపించి.. 5నెలలుగా ఏమీ నిరూపించలేకపోయారన్నారు. అభివృద్ధి లేదు, ఆదాయం లేదు, సంపద సృష్టిపై ఆలోచన లేదని చంద్రబాబు విమర్శించారు. ఖర్చు మాత్రం ఇష్టానుసారం చేస్తూ పోతున్నారన్నారు. మనం అందించిన సంపదను కాపాడుకోలేకపోవటం వల్లే రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. నరేగా బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవటం దారుణమని చంద్రబాబు పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here