రాజధాని ఢిల్లీలోని సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని
కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాము ప్రవేశపెట్టిన
పథకంపై మహిళలు ఎలా స్పందిస్తున్నదీ తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్
బస్సెక్కారు. సిటీ బస్సులో ప్రయాణించి ఈ పథకంపై మహిళలతో మాట్లాడి వారి
అభిప్రాయాలు తెలుసుకున్నారు.
అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మంచి పని ఎప్పటికైనా గొప్పగానే ఉంటుందని అన్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఈ పథకంపై పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. తాము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో సరిపెట్టలేదని, వారి భద్రత కోసం 13వేల మంది మార్షల్స్‌ను నియమించినట్టు సీఎం వివరించారు.
Comments
Post a Comment