Skip to main content
సుకుమార్ - బన్నీ సినిమా మొదలైంది
 


 సుకుమార్ - బన్నీ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, వాళ్ల కార్యాలయంలో కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ముఖ్య అతిథులుగా అల్లు అరవింద్ .. కొరటాల .. సురేందర్ రెడ్డి హాజరయ్యారు. దేవుడి చిత్ర పటాలపై అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

గతంలో సుకుమార్ - బన్నీ కాంబినేషన్లో వచ్చిన 'ఆర్య' .. 'ఆర్య 2' సినిమాలు యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలకి సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్, తాజా చిత్రానికి కూడా సంగీతాన్ని అందించనున్నాడు. ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి. ఈ సినిమాలో బన్నీ జోడీగా రష్మిక మందన కనిపించనున్న సంగతి తెలిసిందే.  

Comments