Skip to main content

మళ్లీ తెరపైకి పవన్ 'సత్యాగ్రహి' టాపిక్



రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయిస్తానంటూ సినిమాలను దూరంపెట్టిన పవన్ కల్యాణ్, ఎన్నికల ఫలితాల తరువాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో కొంతమంది నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకున్న ఆయన, ఇప్పుడు ఆ ప్రాజెక్టులను చేసే ఆలోచనలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 'సత్యాగ్రహి' సినిమా టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది.

పవన్ కల్యాణ్ హీరోగా సూర్య మూవీస్ బ్యానర్ పై 2006లో 'సత్యాగ్రహి' సినిమా సెట్స్ పైకి వెళ్లింది. కొన్ని రోజుల షూటింగ్ అనంతరం కొన్ని కారణాల వలన ఆగిపోయింది. సామాజిక సమస్యలపై ఓ యువకుడి పోరాటంగా సాగే ఆ కథ అప్పట్లో పవన్ కి బాగా నచ్చిందట. అందువలన ప్రస్తుత పరిస్థితుల్లో తన రాజకీయ జీవితానికి ఆ కథ హెల్ప్ అవుతుందని భావించిన పవన్, క్రిష్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో వున్నాడని చెప్పుకుంటున్నారు. ఎ.ఎమ్.రత్నం ఇచ్చిన అడ్వాన్స్ పవన్ దగ్గరే ఉండటం వలన, ఆయన నిర్మాణంలోనే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

Comments