Skip to main content

బిగ్‌బాస్’ పథకం.. శ్రీముఖిని విన్నర్ చేయడానికేనా..!

తెలుగు బుల్లితెరపై విజయవంతంగా కొనసాగుతోన్న ‘బిగ్‌బాస్’ మూడో సీజన్ ఈ వారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హౌస్‌లో ఐదుగురు ఉండగా.. ఈ సీజన్‌కు టైటిల్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారు అన్న దానిపై చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఈ రేసులో శ్రీముఖి ముందు వరుసలో నిలిచింది. ఇటీవల పోలైన ఓట్లలో శ్రీముఖి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. దీంతో టైటిల్ విన్నర్‌గా కూడా ఆమెనే నిలిచే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. అంతేకాదు మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్‌గా శ్రీముఖిని చేసేందుకు తెరవెనుక వ్యూహాలు జరుగుతున్నాయని కూడా టాక్ నడుస్తోంది.
దానికి తోడు ఇటీవల శ్రీముఖి గెలిచిన కొన్ని టాస్క్‌లు ప్రత్యేకంగా ఆమె కోసమే డిజైన్ చేశారా..? అన్నట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అంతేకాదు గతంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హిమజ, మహేష్ విట్టా, హేమలు కూడా ఇలాంటి విమర్శలే చేశారు. హిమజ అయితే ఏకంగా బిగ్ బాస్ డైరెక్టర్లే శ్రీముఖి డెరెక్షన్‌లో షో నడిపిస్తున్నారని ఆరోపణలు చేసింది. హేమ కూడా ఇదే విషయంపై తాజాగా స్పందిస్తూ.. హౌస్‌లో ఎవరు ఎన్నాళ్లు ఉండాలి. ముందే ఫిక్స్ అయ్యి వచ్చారని దాని ప్రకారం ఆట జరుగుతుందని, మొత్తం బిగ్ బాస్ ఆటని శ్రీముఖి ఆడిస్తుందని ఆమె ఆటలో కంటెస్టెంట్స్ బలి అవుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు శ్రీముఖిని విన్నర్‌ను చేసేందుకే ఆమెకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న హిమజ లాంటి వాళ్లను ఎలిమినేట్ చేశారని అప్పట్లో విమర్శలు కూడా వినిపించాయి.
ఇక బిగ్‌బాస్ డైరక్టర్‌ అయిన అభిషేక్ ముఖర్జీ, శ్యామ్ ఇద్దరూ.. శ్రీముఖికి చాలా క్లోజ్. దీంతో వారు కూడా శ్రీముఖినే విన్నర్ కావాలని ఇదంతా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాలన్నింటిని శ్రీముఖి ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. శ్రీముఖి మొదటి నుంచి జెన్యూన్‌గానే ఆటను ఆడుతుందని వారు అంటున్నారు. మరి శ్రీముఖిని విన్నర్ చేసేందుకే నిర్వాహకులు ప్లాన్ చేశారా..? రెండు సీజన్ల రికార్డును బ్రేక్ చేసి శ్రీముఖి టైటిల్‌ను గెలుచుకుంటుందా..? అసలు బిగ్‌బాస్ 3 సీజన్ విన్నర్ ఎవరు..? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఈ వారాంతంలోనే తేలనుంది.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...