వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. జగన్ ను కలవడం, ఆయనతో మాట్లాడటం ఇష్టంలేని దగ్గుబాటి, పార్టీలోని మరో కీలక నేతకు ఈ విషయాన్ని చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో తన భార్య పురందేశ్వరి బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నందున, తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన వెల్లడించినట్టు తెలుస్తోంది.
ఈ సంవత్సరం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ హవా వీచి, ఆ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ, దగ్గుబాటి మాత్రం విజయం సాధించలేకపోయారు. ఆపై భార్యాభర్తలిద్దరూ ఒకే పార్టీలో ఉండాలని జగన్ అల్టిమేటం జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆపై రెండు రోజుల క్రితం దగ్గుబాటి తన కార్యకర్తలతోనూ సమావేశమై, వైసీపీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. దగ్గుబాటి రాజీనామాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. పర్చూరు నియోజకవర్గంలో రామనాథం బాబును పార్టీలోకి తీసుకోవడం కూడా దగ్గుబాటికి ఆగ్రహం తెప్పించిందని ఆయన అనుచరులు అంటున్నారు.
Comments
Post a Comment