ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి జనసేన అధినేత పవన్ కల్యాణ్
కొద్దిసేపటి క్రితం ఫోన్ చేశారు. ఇసుక సమస్యపై వచ్చే నెల మూడో తేదీన
విశాఖపట్టణంలో జనసేన తలపెట్టిన ర్యాలీకి మద్దతు కోరారు. ఇదే విషయమై
అంతకుముందు ఏపీ బీజీపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు కూడా పవన్ ఫోన్ చేసి
ర్యాలీకి మద్దుతు కోరారు. కాగా, చంద్రబాబు-పవన్‌లు ఇసుక అక్రమ రవాణా,
కార్మికుల ఆత్మహత్యలపై చర్చించినట్టు తెలిసింది. ఇసుక సమస్య విషయంలో
బాధితుల పక్షాన పోరాడేందుకు జనసేన సిద్ధంగా ఉన్నట్టు పవన్ చెప్పినట్టు
సమాచారం. ఇరువురు నేతలు దాదాపు 15 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. పవన్
విజ్ఞప్తికి బాబు సానుకూలంగా స్పందించారని సమాచారం.
Comments
Post a Comment