Skip to main content

చినజీయర్ స్వామికి టీఎస్ ఆర్టీసీ కార్మికుల మొర!


చినజీయర్‌ స్వామిని కలిసిన ఆర్టీసీ కార్మికులు



సీఎం కేసీఆర్ తమ సమస్యలను పట్టించుకోవడంలేదని ఆర్టీసీ కార్మికులు చినజీయర్ స్వామికి మొరపెట్టుకున్నారు. 26 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చినజీయర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్, మహేశ్వరం డిపోలకు చెందిన కార్మికులు, జేఏసీ నేతలు  శంషాబాద్, ముచ్చింతల్లో ఉన్న ఆశ్రమానికి వెళ్లి చినజీయర్ స్వామిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారి సమస్యలను స్వామీజీ సావధానంగా విన్నారు. మరోవైపు సరూర్ నగర్ స్టేడియంలో తలపెట్టిన సకల జనభేరి సభ నేపథ్యంలో స్టేడియంలోకి ఆర్టీసీ కార్మికులు భారీ సంఖ్యలో చేరడంతో స్టేడియం నిండిపోయింది.

Comments