Skip to main content

శివసేనకు మద్దతివ్వడానికి మాకు అభ్యంతరం లేదు: కాంగ్రెస్



మహారాష్ట్రలో బీజేపీ-శివసేనల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా? లేదా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని తమకు ఇవ్వాలంటూ శివసేన పెట్టిన కండిషన్ కు బీజేపీ ససేమిరా అంటోంది. మరోవైపు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు మరింత గందరగోళానికి గురి చేస్తున్నాయి. శివసేనకు అసెంబ్లీ ఎన్నికల్లో 44 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు హుస్సేన్ దాల్వాయి చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

శివసేనకు మద్దతివ్వడానికి కాంగ్రెస్ కు ఎలాంటి అభ్యంతరం లేదని హుస్సేన్ అన్నారు. అయితే, ఈ విషయంలో ముందుగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. బీజేపీతో కలిసి ఉంటారో? లేక విడిపోతారో? అనే నిర్ణయాన్ని తీసుకోవాల్సింది థాకరేనే అని అన్నారు. మరోవైపు రెండు, మూడు రోజుల్లో ముంబైలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నట్టు సమాచారం. అదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పక్కా క్లారిటి వచ్చే అవకాశం ఉంది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...