సినిమా స్టార్లు రాజకీయాల్లో ఇమడగలరా? అన్న ప్రశ్నపై ఎంతోకాలంగా జరుగుతున్న చర్చ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. నటుడిగా తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నప్పటికీ, రాజకీయాల్లో విఫలమైన చిరంజీవి, తన సహ నటీనటులైన కమలహాసన్, రజనీకాంత్ లకు రాజకీయాలు వద్దని సలహా ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
చిరంజీవి మాట్లాడిన మాటలను విన్న కమల్ తనదైన రీతిలో స్పందించారు. అందరి అనుభవాలూ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని చిరంజీవి ఇచ్చిన సలహాను ఓ మీడియా సమావేశంలో గుర్తు చేసిన ఆయన, మరెవరైనా ఈ సలహా ఇవ్వవచ్చేమోగానీ, పొలిటీషియన్ గా పనిచేసిన చిరంజీవి ఈ మాటలెలా చెబుతారని ప్రశ్నించారు. ఎవరి అనుభవాలు వారికే పాఠాలు నేర్పుతాయని అన్నారు.
Comments
Post a Comment