Skip to main content

జగన్ ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధం: బీజేపీ నేత రామ్ మాధవ్


 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూస్తామని, కేంద్రం అందిస్తున్న సంక్షేమం పేదలకు అందుతుందో లేదో ఓ కన్నేసి వుంటామని అన్నారు. రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంలా వ్యవహరిస్తూ, క్షేత్ర స్థాయిలో బలపడాలన్న తమ వ్యూహాలను అమలు చేస్తామని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ నుంచి వలసలను నివారించేందుకే, చంద్రబాబునాయుడు ఇప్పుడు తిరిగి బీజేపీతో పొత్తు అంశాన్ని తెరపైకి తెచ్చాడని రామ్ మాధవ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన ఆయన, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మరోసారి తేల్చి చెప్పారు. ఏ పార్టీకీ జూనియర్ గా వ్యవహరించాల్సిన అగత్యం బీజేపీకి పట్టలేదన్నారు

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.