Skip to main content

శివసేన హెచ్చరికల బేఖాతరు... శుక్రవారం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్న దేవేంద్ర ఫడ్నవీస్!


 

50-50 ఫార్ములాను అమలు చేయాలని, తమ నేత ఆదిత్య ఠాక్రేకు రెండున్నరేళ్లు సీఎంగా అవకాశం ఇవ్వాలని, లేకుంటే బీజేపీకి సహకరించేది లేదని శివసేన పార్టీ అధిష్ఠానం చేస్తున్న హెచ్చరికలనులను పట్టించుకోని దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర సీఎంగా శుక్రవారం నాడు మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, ఈలోగానే శివసేనతో ఉన్న విభేదాలు సర్దుకుంటాయని బీజేపీ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు పార్టీల నేతల మధ్యా మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరినా, అది సుదీర్ఘకాల స్నేహాన్ని చెడగొట్టేంత తీవ్రమైనదేమీ కాదని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లూ బీజేపీ ప్రభుత్వమే ఉంటుందనడంలో సందేహం లేదని వార్సాలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.