తాజాగా, ఎన్సీపీ నేత క్లైడ్ క్రాస్టో ఓ కార్టూన్ ను పోస్ట్ చేసి బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎన్నికల గుర్తు కమలంపై శివసేన బాణం గుర్తు ఎక్కుపెట్టినట్లు ఉన్న కార్టూన్ వేసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బీజేపీని శివసేన గురి చూసి కొడుతుందనేలా ఈ కార్టూన్ ఉంది.
కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ దక్కని నేపథ్యంలో బీజేపీకి శివసేన మద్దతు తప్పనిసరి అయింది. దీంతో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న డిమాండ్ ను శివసేన తీసుకొచ్చింది. అయితే, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాత్రం ఈ ప్రతిపాదనకు ఒప్పుకోవట్లేదు.
Comments
Post a Comment