ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్ భారత్‌లో పునరాగమనానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో ఉన్న తన యూజర్ బేస్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓ వైపు ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తూనే.. మరోవైపు
భారత్‌లో తన వ్యాపారాన్ని విక్రయించే అంశంపై చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా దేశీయ అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ చర్చలు జరిపినట్లు ‘టెక్ క్రంచ్’ వెబ్‌సైట్ పేర్కొంది.
గత నెలలోనే ఈ రెండు కంపెనీల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు తెలిసింది. అయితే, ఒప్పందం ఇంకా ఓ కొలిక్కి రాలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు ఆ వెబ్‌సైట్ వెల్లడించింది. దీనిపై అటు రిలయన్స్‌గానీ, ఇటు బైట్ డ్యాన్స్ గానీ స్పందించలేదు. మరోవైపు అమెరికాలో సైతం ఈ యాప్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌తో ఆ సంస్థ చర్చలు జరుపుతోంది. అదే క్రమంలో ఇండియా కార్యకలాపాలను కూడా మైక్రోసాఫ్టే కొనుగోలు చేయనుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ట్విటర్ కూడా టిక్‌టాక్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Comments
Post a Comment