Skip to main content

తెలంగాణ లో ఆన్ లైన్ లో ఇంటర్ అడ్మిషన్లు ?


సర్కార్కు ప్రతిపాదనలు పంపిన బోర్డ్
ముందు సర్కార్ కాలేజీల్లో ..తర్వాతే ప్రైవేటులో..

 అడ్మిషన్ ప్ర‌క్రియలో మార్పులు చేసే యోచనలో బోర్డు అధికారులున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్ లైన్లో అడ్మిషన్లు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సర్కారు ఓకే చెప్పిన వెంటనే, ముందుకు పోయేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రైవేటుకు చెక్ పెట్టేందుకే..
కరోనా ఎఫెక్ట్ తో ఈసారి అకడమిక్ ఇయర్ అస్తవ్యస్థంగా మారింది. జూన్ ఫస్ట్ నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ అడ్మిషన్ల ప్రాసెస్ ఇప్పటికీ షురూ కాలేదు. స్టూడెంట్లు కాలేజీలకు వచ్చి అడ్మిషన్లు తీసుకునే పరిస్థితులు లేవు. టెన్త్ రిజల్ట‌స్  ప్ర‌కటించి రెండు నెలలు దాటింది. అప్పటి నుంచి వారంతా కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా టెన్త్ స్టూడెంట్స్ ను పాస్ చేయడంతో 5.34 లక్షల మంది పాస్ అయ్యారు. ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభించాయి. ఇప్పుడే చేరితే ఫీజు తగ్గిస్తామంటూ పేరెంట్స్ ను ఒప్పించి, కాలేజీల్లో చేర్చుకుంటున్నాయి. సర్కారు కాలేజీల్లో మాత్రం ఇప్పటికీ అడ్మిషన్ల హడావుడి లేదు. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలను కట్టడి చేసేందుకు ఆన్ లైన్ అడ్మిషన్ల విధానం అమలు చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. దీన్ని అమలు చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
సర్కారు కాలేజీలకే ఫస్ట్ ప్రయారిటీ
రాష్ట్రంలో 404 సర్కారు కాలేజీలుండగా, గతేడాది లక్ష మంది అడ్మిషన్ తీసుకున్నారు. ఈసారి టెన్త్లో ఉత్తీర్ణ‌త‌ శాతం పెరగడం, మిడ్ డే మిల్స్సౌకర్యం కూడా ఉండటంతో అడ్మిషన్లు లక్షన్నర దాటే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఆన్ లైన్ అడ్మిషన్లను ముందుగా గవర్నమెంట్ కాలేజీలకు.. ఆ తర్వాతే ప్రైవేటు కాలేజీలకు అవకాశం ఇవ్వాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తోంది. టెన్త్ మెమో నెంబర్, ఆధార్ నెంబర్ ఆధారంగా ఆన్ లైన్ అడ్మిషన్లు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఆన్ లైన్ లో ఒక కాలేజీలో రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్, మళ్లీవేరే కాలేజీలో చేరే అవకాశం ఉండదు. దీంతో కార్పొరేట్ కాలేజీలకు చెక్ పెట్టినట్టు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో మరోవారం, పది రోజుల్లో అడ్మిషన్ల ప్రక్రియపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది


Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.