Skip to main content

చౌక ధరలో రెమెడిసివిర్ ఇంజక్షన్ ను ఆవిష్కరించిన జైడస్ కాడిలా

 


శరీరానికి సోకిన కరోనా మహమ్మారిని తరిమేసేందుకు గిలియన్ సైన్సెస్ తయారు చేసిన యాంటీ వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ జనరిక్ వర్షన్ ను జైడస్ కాడిలా చౌక ధరకు ఆవిష్కరించింది. 100 ఎంజీ ఇంజక్షన్ ను తాము రూ. 2,800కు అందించాలని నిర్ణయించామని మార్కెట్లో ఇది 'రెమ్ డాక్' పేరిట అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. కరోనాకు చికిత్స చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఈ ఔషధాన్ని విక్రయిస్తామని బీఎస్ఈ రెగ్యులేటరీ ఫైలింగ్ లో సంస్థ పేర్కొంది.

కాగా, ఇప్పటికే రెమెడిసివిర్ ను నాలుగు కంపెనీలు ఇండియాలో మార్కెటింగ్ చేస్తుండగా, ఇప్పుడు జైడస్ కాడిలా ఐదవ సంస్థగా నిలిచింది. హెటిరో ల్యాబ్స్, సిప్లా, మైలాన్ ఎన్వీ, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ లు ఇప్పటికే ఈ డ్రగ్ జనరిక్ వర్షన్ ను విడుదల చేశాయి. గిలియడ్ సైన్సెస్ మొత్తం 127 దేశాల్లోని కంపెనీలతో డీల్స్ కుదుర్చుకుని రెమెడిసివిర్ తయారీకి అనుమతులను ఇచ్చింది.  

Comments