అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అమరావతిలో ప్రస్తుత నిర్మాణాల పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనాలు పూర్తి చేసే కార్యాచరణపై చర్చించారు. నిర్మాణలు పూర్తి చేయడం కోసం నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆర్థికశాఖ అధికారులతో చర్చించి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. హ్యాపీ నెస్ట్ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment