Skip to main content

నటుడు దగ్గుబాటి రానా సోదరుడు అభిరామ్ కారుకు ప్రమాదం

 

టాలీవుడ్ యువ నటుడు దగ్గుబాటి రానా సోదరుడు అభిరామ్ కారుకు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఆరేపల్లికి చెందిన రాజు బ్రెజా కారు కొనేందుకు హైదరాబాద్‌లోని మణికొండ వచ్చాడు. అక్కడ కారు యజమానిని కలిసి టెస్ట్ డ్రైవ్ కోసం కారును తీసుకుని సతీశ్ అనే స్నేహితుడితో కలిసి వెళ్లాడు. 


ఈ క్రమంలో పంచవటి కాలనీలో మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ వద్ద పక్క రోడ్డులో అభిరామ్ బీఎండబ్ల్యూ కారు, బ్రెజా కారు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో నిన్న సాయంత్రం రాజు, అభిరామ్ ఇద్దరూ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజు, అభిరామ్‌లకు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా ఎవరూ మద్యం మత్తులో లేరని తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.