Skip to main content

ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు శుభవార్త!



గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు శుభవార్త....  గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు త్వరలో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో ఈ కంపెనీలు రికరింగ్ పేమెంట్ మ్యాండేట్స్ అంశంపై ప్రస్తుతం చర్చిస్తున్నాయి. ఎన్‌పీసీఐతో ఈ కంపెనీల చర్చలు సఫలం అయితే యూజర్లకు ప్రయోజనం కలుగనుంది. తద్వారా ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు ఆటో డెబిట్ సదుపాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే నెలవారీ బిల్లులను సులభంగా చెల్లించొచ్చు. కరెంటు బిల్లు, మొబైల్ ఫోన్ బిల్లు, ఈఎంఐలు, మీడియా సబ్‌స్క్రిప్షన్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం ఇలా ఎన్నో రకాల చెల్లింపులు ఆటోమేటిక్ గా చెల్లించవచ్చు. వాటి చెల్లింపులకు చివరి తేదీ ఎప్పుడు, ఎలా చెల్లించాలి తదితర విషయాల గురించి ఇక ఆలోచించాల్సిన పని ఉండదు. దాదాపు నెల రోజుల్లోనే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయా కంపెనీల వర్గాల ద్వారా తెలుస్తోంది


.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.