Skip to main content

విశాఖ శంకుస్థాపనకు మోదీని పిలుస్తాం: బొత్స

 

ఎట్టి పరిస్థితుల్లో విశాఖ రాజధాని శంకుస్థాపన జరిగి తీరుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మన కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగితే అందరినీ ఆహ్వానిస్తామని... అదే విధంగా విశాఖ శంకుస్థాపనకు కూడా ప్రధాని మోదీతో పాటు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు. అమరావతిని కూడా చంద్రబాబు గ్రాఫిక్స్ మాదిరి కాకుండా నిజంగా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు.

అమరావతిలో పెండిగ్ పనులపై దృష్టి సారించామని బొత్స చెప్పారు. అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని తెలిపారు. అంతేకాని, ఆర్థిక పరిస్థితిని చూసుకోకుండా, ఆర్బాటాలకు పోయి, అప్పులు తెచ్చుకుంటూ అమరావతిని నిర్మించలేమని చెప్పారు. చంద్రబాబుకు స్వప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. ప్రతిపక్ష పాత్రను పోషించడంలో టీడీపీ విఫలమైందని చెప్పారు. అధికారపక్షం, ప్రతిపక్షం రెండు పాత్రలను తామే పోషించుకుంటూ, న్యాయస్థానాలకు లోబడి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. నిజం, నిజాయతీనే ఎప్పటికీ నిలుస్తాయని చెప్పారు.  

Comments