Skip to main content

అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా మన కమలా హ్యారీస్



సెలెక్ట్ చేసిన ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ జో బిడెన్

కాలిఫోర్నియా సెనెటర్ కు అరుదైన గౌరవం
ఈ పదవికి పోటీ పడుతున్న తొలి బ్లాక్ వుమెన్ గా రికార్డు
ఇండియన్-అమెరికన్లు, బ్లాక్స్ ను ఆకర్షించేలా బిడెన్ వ్యూహం
ఇదినాకు గొప్ప గౌరవం: కమలా హ్యారీస్

డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఇండియన్‑అమెరికన్ సెనెటర్ క‌మలా హ్యారీస్ ఎంపికయ్యారు. ఆపార్టీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ జోబిడెన్..తన రన్నింగ్ మేట్ గా హ్యారీస్ ను సెలెక్ట్ చేసుకున్నారు. కాలిఫోర్నియాకు చెందిన 55 ఏండ్ల కమలా హ్యారీస్ ప్రొఫెషన్ రీత్యా లాయర్. కమలా హ్యారీస్ తండ్రిది జమైకా. తల్లి ఇండియన్.

డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఇండియన్–అమెరికన్ సెనెటర్ క‌మలా హ్యారీస్ ఎంపికయ్యారు. డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ జోబిడెన్.. తన రన్నింగ్ మేట్ గా హ్యారీస్ ను సెలెక్ట్ చేసుకున్నారు. మంగళవారం ఒక టెక్ట‌స్ మెసేజ్ ద్వారా బిడెన్ ఈ విషయాన్ని తన సపోర్ట‌ర్ల‌కు వెల్లడించారు. నవంబర్3న జరిగే అమెరికా ప్రెసిడెన్షియ‌ల్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ను ఓడించేందుకు ప్రయత్నిస్తున్న బిడెన్.. ఇండియన్ అమెరికన్లు, బ్లాక్ ఓటర్ల‌ను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా హ్యారీస్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

మొదట ప్రెసిడెంట్ అభ్యర్థిగా..

కాలిఫోర్నియాకు చెందిన 55 ఏండ్ల కమలా హ్యారీస్ ప్రొఫెషన్ రీత్యా లాయర్. కమలా హ్యారీస్ తండ్రిది జమైకా. తల్లి ఇండియన్. ప్రస్తుం ఆమె కాలిఫోర్నియా నుంచి సెనెటర్ గా ఉన్నారు. శాన్ ఫ్రాన్సిస్కో కంట్రీ డిస్ట్రిక్ట్ అటార్నీగా హ్యారీస్ పనిచేశారు. ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా, తొలి ఆఫ్రికన్-అమెరికన్ గా, ఇండియన్ గా రికార్డు సృష్టించారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా ఎంపికైన తొలి మహిళా ఆఫ్రికన్-అమెరికన్ గా, ఇండియన్ గా నిలిచారు. అలాగే సెనెట్ కు ఎంపికైన తొలి ఇండియన్ గా, రెండో ఆఫ్రికన్–అమెరికన్ గా ఉన్నారు. 2019 జనవరిలో కమలా హ్యారీస్ పెసిడెన్షియ‌ల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. కొన్ని నెలల తర్వాత ఆమె క్యాంపెయిన్ అనుకున్న స్థాయికి చేరలేదు. దాంతో గత ఏడాది చివరిలో ఆమె రేస్ నుంచి తప్పుకున్నారు. ఈ ఏడాది మొదట్లో బిడెన్ అభ్యర్ధిత్వానికి ఆమె మద్దతు తెలిపారు. అయితే ప్రైమరీస్, ప్రీప్రైమరీల టైంలో బిడెన్ తో ఆమెకు సన్ని
హిత సంబంధాలు లేవు. ఆమె స్కిల్ ను గుర్తించిన బిడెన్.. హ్యారీస్ ను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత బిడెన్ క్యాంపెయిన్ కోసం ఆమె పెద్ద మొత్తంలో నిధులు సమీకరించారు.
గొప్ప గౌరవం: హ్యారీస్
తన రన్నింగ్ మేట్ గా ఒక వుమెన్ ను సెలెక్ట్ చేస్తానని మార్చిలోనే బిడెన్ ప్ర‌కటించారు. డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ కు మరో వారం రోజులు ఉండగా.. కొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదించారు. ఫార్మల్ గా కమలా హ్యారీస్ పేరును వైస్ ప్రె సిడెంట్ గా నామినేట్ చేశారు. ‘‘నేను జో బిడెన్. నా రన్నింగ్ మేట్ గా కమలా హ్యారీస్ ను సెలెక్ట్ చేసుకున్నా. మీతో కలిసి మేం ట్రంప్ ను ఓడిస్తాం. మన టీమ్ లోకి ఆమెకు వెల్ కం చెప్పండి”అని బిడెన్ త‌న మెసేజ్ లో పేర్కొన్నారు. ‘‘నన్ను మా పార్టీ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా ఎంపిక చేయడం గొప్ప గౌరవం. బిడెన్ ను కమాండర్ ఇన్ చీఫ్ గా చేసేందుకు చేయగలిగినంతా చేస్తా”అని కమలా హ్యారీస్ ఓ ట్వీట్చేశారు. అమెరికన్ల కోసం పోరాటం చేసేందుకు బిడెన్ త‌న జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన అమెరికన్లను ఏకం చేయగలర ని చెప్పారు. బిడెన్ నిర్ణ‌యంపై ప్రెసిడెంట్ ట్రంప్ స్పందిస్తూ.. ఈ డెసిషన్ త‌నను కొంత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. ఆమె జో బిడెన్ పట్ల అగౌరవంగా ఉందని, అలాంటి ఆమెను ఎంపిక చేయడం
కష్టమైన విషయమని అన్నారు. అమెరికాలోని ఇండియన్-అమెరికన్ గ్రూపులు హ్యారీస్ ఎంపికను
స్వాగతించాయి.

ఎన్నికైతే రికార్డే

వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపికవడం ద్వారా ఓ మేజర్ పొలిటికల్ పార్టీ నుంచి ఈ పదవికి పోటీ పడుతున్న తొలి బ్లాక్ వుమెన్ గా హ్యారీస్ రికార్డు సృష్టించనున్నారు. మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా సూచనల మేరకే కమలా హ్యారీస్ ను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా బిడెన్ ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఇద్దరు మహిళలు మాత్రమే వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లుగా నామినేట్ అయ్యారు. 2008లో రిపబ్లికన్ పార్టీ నుంచి సారా పాలిన్, 1984లో డెమోక్రట్ పార్టీ నుంచి గెరాల్డిన్ ఫెరారో పోటీ పడినా వైట్హౌస్ లోకి అడుగు పెట్ట లేకపోయారు. ఒకవేళ కమలా హ్యారీస్ వైస్ ప్రెసిడెంట్ గా గెలిస్తే.. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టిస్తారు. అలాగే మొదటి ఇండియన్-అమెరికన్ గా, ఆఫ్రికన్-అమెరికన్ గా నిలుస్తారు.

Comments