4G -Only iPhone 12 యొక్క చవక మోడల్, కేవలం 4G- సపోర్ట్ తో మాత్రమే వస్తుందని రూమర్
iPhone 12 మరియు 12 Pro ఫోన్లు రెండూ అక్టోబర్ లో మొదటి వేవ్ లో లాంచ్ అవుతాయని ఊహిస్తున్నారు
ప్రస్తుత ఆపిల్ సరసమైన ఫోన్ iPhone SE వంటి ఫోన్ లతో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులను సంపాదించానికి కృషి చేస్తున్నట్లు అర్ధమౌతోంది.
iPhone 12 గురించి నెట్టింట్లో వస్తున్న రూమర్లు నిజమైతే కనుక, ఈ సారి iPhone తీసుకురానున్న iPhone 12 లైనప్ చాలా విస్తృతమైనది మరియు ఉత్తేజకరమైనదిగా ఉండవచ్చు. నెక్స్ట్ జెనరేషన్ ఐఫోన్ సరికొత్త డిజైన్, సన్నని బెజెల్ మరియు 5G సపోర్ట్ కలిగి ఉందనే రూమర్ ఉంది. ఏదేమైనా, 2021 ప్రారంభంలో 5 జి మద్దతు లేకుండా చౌకైన ఐఫోన్ 12 వస్తుందని కొత్త నివేదిక సూచిస్తుంది.
ఈ ఐఫోన్ 12 యొక్క చవక మోడల్, కేవలం 4G- సపోర్ట్ తో మాత్రమే వస్తుందని, ఈ మోడల్ ధర సుమారు $ 800 (సుమారు రూ .60,000) ఉందవచ్చని మరియు ప్రస్తుత ఆపిల్ సరసమైన ఫోన్ iPhone SE వంటి ఫోన్ లతో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులను సంపాదించానికి కృషి చేస్తున్నట్లు అర్ధమౌతోంది.
ఆపిల్ 2021 ప్రారంభంలో, చౌకైన 4G -Only iPhone 12 ను విడుదల చేయనుంది. కంపెనీ త్రైమాసిక ఆదాయాల కాల్ సందర్భంగా ఆపిల్ CFO లూకా మేస్త్రీ మాట్లాడినప్పుడు iPhone 12 ప్రొడక్షన్ వెనుకబడిందని ఆపిల్ ఇప్పటికే ధృవీకరించింది.
ఒక 6.1-అంగుళాల iPhone 12 మరియు 12 Pro ఫోన్లు రెండూ అక్టోబర్ లో మొదటి వేవ్ లో లాంచ్ అవుతాయని, 5.4-అంగుళాల iPhone 12 మరియు 6.7-అంగుళాల iPhone 12 Pro తరువాతి కాలంలో విడుదల చేయబడతాయని, ఇది బహుశా నవంబర్ లో కావచ్చని తెలిపింది. ఈ విషయాలన్నిటిని చూస్తుంటే, 2021 ప్రారంభంలో చౌకైన 4G -Only iPhone 12 విడుదల గురించి సరిపోలుతున్నాయి.
ఇక ఇతర iPhone వార్తలలో, ఈ ఐఫోన్ 12 ప్రో ఫోను ఎక్కువగా రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగి ఉండవు. ఇంజనీర్లు బ్యాటరీ జీవితానికి సంబంధించి ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.
Comments
Post a Comment