Skip to main content

గుడ్‌న్యూస్‌... భారీగా ప‌డిపోయిన ప‌సిడి ధ‌ర‌



వ‌రుస‌గా పెరుగుతూ సామాన్యుడు అందుకోనంత ఎత్తుకు దూసుకెళ్లిన బంగారం ధ‌ర క్ర‌మంగా కింద‌కు దిగుతోంది. ఆల్‌టైం హై రికార్డులు సృష్టించిన ప‌డిసి ధ‌ర‌.. నాలుగు రోజులుగా ప‌డిపోతోంది... నిన్నటి వ‌ర‌కు వంద‌ల్లో త‌గ్గ‌గా.. ఇవాళ ఏకంగా వేల‌ల్లో ప‌డిపోయింది. పసిడి ప్రేమికులకు శుభార్త చెబుతూ రూ.3వేల‌కు పైగా త‌గ్గింది. హైద‌రాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3350 క్షీణించి రూ.54,680కి ప‌డిపోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3010 ప‌డిపోయివ‌డంతో రూ.50,130కు దిగివ‌చ్చింది. అయితే, ప‌సిడి ధ‌ర ప‌డిపోయినా వెండి కాస్త పైకి క‌దిలింది.. రూ.50 పెర‌గ‌డంతో.. కిలో వెండి ధ‌ర రూ.72,550కు చేరింది. 

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల ప్ర‌భావం దేశీ మార్కెట్ల‌పై స్ప‌ష్టంగా చూపిస్తోంది.. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 0.15 శాతం క్షీణించింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1944 డాలర్లకు దిగివ‌చ్చింది.. ఇక‌, కొత్త రికార్డులు సృష్టించిన బంగారం ధ‌ర ప‌డిపోయినా చాలా ప్ర‌భావాన్ని చూపించ‌నుంది.. బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ పై స్ప‌ష్టంగా క‌నిపించ‌నుంది. వ‌రుస‌గా బంగారం ధ‌ర పెర‌గ‌డంతో.. బంగారంపై ఇచ్చే రుణ ప‌రిమితిని పెంచుతూ వ‌చ్చాయి బ్యాంకులు.. వాటిపై కూడా ఈ ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉందంటున్నారు మార్కెట్ విశ్లేష‌కులు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...