Skip to main content

సుశాంత్ సింగ్ పై అభిమానం... 'సడక్-2'పై ఆగ్రహమైంది!

 


సంజయ్ దత్, ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషించగా, ఆలియా తండ్రి మహేశ్ భట్ నిర్మించిన 'సడక్-2' ట్రయిలర్ ఇప్పుడు అత్యంత చెత్త రికార్డులను క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ట్రయిలర్ విడుదల కాగానే, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పై ఉన్న అభిమానం, ఈ ట్రయిల్ పట్ల శాపమైంది. 


బాలీవుడ్ లో బంధుప్రీతి కారణంగానే సుశాంత్ సూసైడ్ చేసుకున్నారన్న ఆరోపణలు, గతంలో మహేశ్ భట్, సుశాంత్ కు అన్యాయం చేశారన్న పుకార్ల నేపథ్యంలో, ఈ వీడియోకు అత్యధిక డిస్ లైక్స్ రావడం గమనార్హం.

ఇక ఈ సినిమా ట్రయిలర్ కింద సుశాంత్ కు న్యాయం జరగాల్సిందేనంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ ట్రయిలర్ కు ఏకంగా 30 లక్షలకు పైగా డిస్ లైక్స్ వచ్చాయి. ప్రపంచంలోనే అత్యధిక డిస్ లైక్ లు వచ్చిన ట్రయిలర్ గా ఇది నిలుస్తుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.  

Comments