Skip to main content

చైనా లో క‌ల‌క‌లం : ఆరు నెల‌ల త‌రువాత విజృంభిస్తున్న క‌రోనా



ఆరునెల‌ల త‌రువాత చైనాలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న‌ట్లు తేలింది. చైనా కు చెందిన 68ఏళ్ల మహిళ క‌రోనా నుంచి కోలుకున్న ఆరు నెలల తర్వాత మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు ప్ర‌క‌టించారు.

చైనా హుబీ ప్రావిన్స్‌లోని జింగ్‌జౌ కు చెందిన బాధితురాలి ఆరు నెల‌ల క్రితం వైర‌స్ సోకి న‌య‌మైంది. మ‌ళ్లీ అదే మ‌హిళ‌కు వైర‌స్ సోక‌డంపై డాక్ట‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

వృద్ధురాలి కరోనా సోక‌డంతో ఆమెతో సంబంధం ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికి వైర‌స్ టెస్ట్ చేసిన‌ట్లు డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్లు మాట్లాడుతూ మానవ శరీరం నుండి కరోనావైరస్ ను తొలగించడానికి చాలా సమయం పడుతుందని, ఇది ఒక‌ అరుదైన కేస‌ని ఓ వైరాలజిస్ట్ చైనా స్టేట్ మీడియాతో చెప్పారు.

కరోనా తిరగబెట్టిన కేసులు గతంలో పలుమార్లు వెలుగు చూసినప్పటికీ ఇంతకాలం తరువాత ఆ వృద్ధురాలిలో కరోనా మళ్లీ నిద్రలేవడం శాస్త్రవేత్తలను, అధికారులను ఆందోళనకు గురించేస్తోంది.

కరోనా పూర్తిగా తగ్గినప్పటికీ కొన్ని సందర్భాల్లో శరీరంలో వైరస్ మిగిలే ఉంటుందా.. అదే నిజమైతే దేహం నుంచి కరోనా పూర్తిగా తొలగిపోవడానికి ఎంత సమయం పడుతుంది.. వంటి అతి ముఖ్యమైన ప్రశ్నలను తాజా ఉదంతం తెరపైకి తెచ్చింది.

Comments