Skip to main content

టీడీపీ శ్రేణుల ఓపికను పరీక్షించొద్దు..- టీడీపీ మాజీమంత్రి హెచ్చరిక


నెల్లూరు జిల్లా కావలిలో వైకాపా నాయకుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, బీద రవిచంద్ర పరామర్శించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు..కావలి టీడీపీ ఆఫీసులో కూర్చోవున్న కార్యకర్తలపై దాడి చేయడం దుర్మార్గమన్నారు..ఐదు నెలలుగా కావలిలో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ, బెదిరిస్తుంటే ఇప్పటి వరకు పోలీసుల చర్యలు లేవంటూ ఆరోపించారు.
వాళ్ళు చర్యలు తీసుకోకపోవడం వల్లే తమ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారన్నారు..ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో శాంతిభద్రతలు చేయిదాటిపోతున్నాయని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఎమ్మెల్యేలు, వారి పక్కనే ఉండే చోటా నేతలు చెప్పిందే చేస్తామనే ధోరణిలో పోలీసులు వ్యవహరిస్తుంటే ప్రజాస్వామ్యం బతికేవుందా అనే అనుమానాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో పది సీట్లు ఇచ్చి మంచిగా పరిపాలించండయ్యా అంటే దొంగ కేసులు పెట్టడంతో పాటు దౌర్జన్యాలు, అరాచకాలు, ఆస్తుల విధ్వంసాలు చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ కార్యకర్తలను ఇళ్లకు వెళ్లి కొడుతూ తిరిగి బాధితులపైనే కేసులు పెడుతూ హింసిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ బీదా రవి చంద్ర మాట్లాడుతూ తమ నేతలపై అట్రాసిటీ కేసులు పెడుతూ చిన్న చిన్న కుటుంబాలను సైతం వేధిస్తున్నారన్నారు.. వైకాపా నేతల తీరు మారకపోతే చూస్తూ ఊరుకోం..టీడీపీ శ్రేణుల ఓపికను పరీక్షించొద్దంటూ హెచ్చరించారు..

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here