నిబంధనలు పాటించకుండా తయారుచేస్తున్న ఓ వంటనూనె కంపెనీకి ప్రచారం చేస్తున్నారంటూ సినీ నటి అంజలిపై ఆహార భద్రతా శాఖాధికారికి ఫిర్యాదు అందింది. ఈరోడ్ ప్రధాన కార్యాలయంగా నడుస్తున్న కంపెనీ నూనెను పరిశోధనలకు పంపగా అది ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని తేలిందని కోవైకి చెందిన కోవై సుడర్‌పార్వై మక్కళ్ ఇయక్కం అధ్యక్షుడు సత్యగాంధీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు గురువారం ఆయన కోవై ఆహార భద్రత శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించకుండా తయారుచేస్తున్న నూనెను కోవై జిల్లాలో పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని, తయారీదారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఆ నూనె వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్న నటి అంజలిపైనా చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు.

Comments
Post a Comment