Skip to main content

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మండిపడ్డ డిప్యూటీ సీఎం పుష్పా శ్రీవాణి

అమరావతి సచివాలయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సిఎం పుష్పశ్రీవాణి మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలను ఎన్నిసార్లు రద్దు చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. 2015 నవంబరు 5న టీడీపీ ప్రభుత్వమే జీవో నెంబరు 97 తీసుకు రాలేదా...
బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసినట్టు మీ అధికారంలో ఏదయినా జీవో వచ్చిందా. చింతపల్లిలో జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అధికారానికి వచ్చిన వందరోజుల్లోనే జీవో నెంబరు 97 ను ప్రభుత్వం రద్దు చేసింది..

నాలుగు నెలల పాలనలో ప్రజలకు నరకం చూపామని చంద్రబాబు అన్నారు. 
మీకు అయిదేళ్ళు టైం ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారో అందరికి తెలుసు.
ఎస్సీ , ఎస్టీ, బిసి, మైనార్టీ లకు 50శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత జగన్ ది. మహిళలకు సైతం 50శాతం రిజర్వేషన్లు ఈ సర్కార్ ఇచ్చింది.
సచివాలయ పోస్టులను కూడా టీడీపీ నేతలు విమర్శిస్తున్నరు. 
గత అయిదు ఏళ్ళలో ఉద్యోగాలు తీయ్యమని యువత అడిగితే లాఠీ చార్జి చేసారు.
లక్షా 20 వేల ఉద్యోగాలు తీసిన జగన్ ను ఎలా చంద్రబాబు ఎలా విమర్శిస్తారు.

వాలంటీర్లుకు గోనెసంచిలు మోసే ఉద్యోగం ఇచ్చామన్నారు.
ప్రభుత్వం ఇచ్చే బియ్యం, పెన్షన్ ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి వారికి చేరువచేసే వ్యవస్ధ ఇది.
కేవలం అయిదు వేల రూపాయలకు సేవా ద్రుక్పదంతో వారు గౌరవ వేతనం తీసుకొని పనిచేస్తున్నారు.
వాలంటీర్ల వ్యవస్ధను కించపరిచేవిధంగా మాటాడడం తగదు.
ఇలా మాటాడే ముందు 40 ఏళ్ళ మీ అనుభవం ఏమయ్యింది. 
చివరకు 23 సీట్లు కు మిమ్మల్ని ప్రజలు తెచ్చారు. ఇలా గే ముందుకు వెళితే ఆ సీట్లు కూడా ఉండవు.

Comments