Skip to main content

జగన్ ఢిల్లీ టూర్ …మోదీకి క్రెడిట్ ఇవ్వనున్న సీఎం జగన్


ఏపీ సీఎం జగన్ ఢిల్లీపర్యటన ఖరారయ్యింది.శనివారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా ఒక రోజు ముందే మోదీతో భేటీ అయ్యారు. ఇద్దరు సీఎంలు వరుసగా భేటీ అవడం తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం, రివర్స్ టెండరింగ్, పీపీఏల పున:పరిశీలన, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన అంశాల గురించి మోదీతో జగన్ చర్చించనున్నట్లు సమాచారం.
అక్టోబర్ 15న రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తోన్న జగన్.. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీని ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతు భోరోసా పథకంపై భాజాపా నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో స్టిక్కర్ సీఎం బాబు లాగా మీరు అయ్యారంటూ విమర్శలు చేస్తున్నారు.
వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు రూ.12500 అందజేస్తుండగా.. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నుంచి వచ్చే రూ.6 వేలను కూడా అందులో కలుపుతారు. దీంతో ఈ పథకానికి మోదీ పేరు పెట్టాలని జగన్‌ను రాష్ట్ర బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. వారి నోళ్లు మూయించే దిశగా జగన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
చంద్రబాబు ఇలాగే కేంద్రం నిధులిచ్చిన పథకాలకు తన పేరు పెట్టుకున్నారని మోదీ, అమిత్ షా సహా ఇతర బీజేపీ నేతలు విమర్శించారు. స్టిక్కర్ సీఎం అంటూ ఎద్దేవ చేశారు. ఇప్పుడు అలాంటి విమర్శలకు తావులేకుండా జగన్ జాగ్రత్తపడుతున్నారు.ఈ పథకానికి ప్రధాని మోదీ పేరు కూడా జత చేసేందుకు ఆయన సిద్ధపడుతున్నారని సమాచారం. ఈ విషయాన్ని మోదీకి చెప్పి.. పథకం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆయన కోరనున్నారట. ఈ పథకానికి మోదీ పేరు పెడితే విమర్శలకు తావుండదు.
వైఎస్ఆర్ భరోసాకు మోదీ పేరును జత చేయడం ద్వారా తనకు, చంద్రబాబుకు ఎంతో తేడా ఉందని జగన్ పరోక్షంగా చెప్పినట్టే.అటు టీడీపీ నేతలపై విమర్శలు చేయడంతోపాటు.. ఇటు బీజేపీ నేతల నోళ్లు మూయించడానికి జగన్ నిర్ణయం ఉపయేగపడుతుంది.స్తుతానికైతే వైఎస్ఆర్ మోదీ రైతు భరోసా అని ఈ పథకానికి పేరు పెట్టాలని భావిస్తున్నారట. జగన్ అంటే అంతే మరి….?

Comments