Skip to main content

గరుడసేవకు ఒక్కరోజు ముందే తిరుమలలో లక్షలాది మంది భక్తులు..


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం గరుడ సేవ. స్వామివారికి ఎంతో ఇష్టమైంది గరుత్మంతుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని గరుడ సేవరోజు తిలకిస్తే సకల పాపాలు తొలగిపోయి మంచి జరుగుతుందన్నది భక్తుల నమ్మకం. అందుకే ఆ స్వామిని చూసేందుకు భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి భారీగా తరలివస్తున్నారు

అంతే కాదు రేపు గరుడ సేవ జరుగనుండగా ఈరోజుకే లక్షలాదిమంది జనం తిరుమలకు చేరుకున్నారు. తిరుపతి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో గోవింద మాలలు ధరించిన భక్తులు సేదతీరుతున్నారు. ఆ స్వామివారిని కనులారా వీక్షించేందుకు భక్తులు తండోతండాలుగా తరలివస్తున్నారు.

ప్రతి యేడాది గరుడోత్సవం రోజు 4నుంచి 5లక్షలమంది జనం శ్రీవారిని దర్సించుకుంటారు. అలాంటిది ఈ యేడాది ఆ సంఖ్య పెరిగే అవకాశముందని టిటిడి అంచనా వేస్తోంది. ఒకరోజు ముందుగానే భక్తజనం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో టిటిడి ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందనేది ప్రశ్నార్థంకంగా మారుతోంది.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.