Skip to main content

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

విజయవాడ కనకదుర్గమ్మ వారికి ఏపీ సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈరోజు సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన దుర్గమ్మను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జగన్ కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీఎం హోదాలో తొలిసారిగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Comments