Skip to main content

నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను.. నాలుగు నెలల్లోనే హామీ నిలబెట్టుకున్నాను: జగన్

నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నా'నంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇచ్చారు, ఒక అన్నలా, ఒక తమ్ముడిలా తాను అండగా ఉంటానని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈరోజు 'వైయస్సార్ వాహన మిత్ర' పథకాన్ని జగన్ ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆటోవాలా చొక్కా వేసుకుని ఆయన మాట్లాడుతూ, పాదయాత్ర సందర్భంగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని చెప్పారు. ఏలూరులోనే ఈ హామీని ఇచ్చానని, ఇప్పుడు ఏలూరులోనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీని నిలబెట్టుకున్నానని చెప్పారు.

సొంత ఆటో, కారు ఉన్నవారికి ఏటా రూ. 10 వేల సాయాన్ని అందిస్తామని జగన్ చెప్పారు. ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ. 50 వేలు ఇస్తామని తెలిపారు. ఈ పథకం కింద 1,73,531 మంది లబ్ధి పొందుతారని చెప్పారు. డ్రైవర్ల అకౌంట్లలోకి ఈ డబ్బును నేరుగా జమ చేస్తామని తెలిపారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలని అధికారులను ఆదేశిస్తున్నానని అన్నారు

Comments