Skip to main content

దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేయించిన చంద్రబాబు..నేడు జగన్ కి నీతులు చెపుతున్నాడు: సి.రామచంద్రయ్య


సి రామచంద్రయ్య వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోయున సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు..
చంద్రబాబు కు ప్రజలు 23 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఉన్మాదిలా మాట్లాడుతున్నారు..
తిరుపతి కి సీఎం వెళ్ళినప్పుడు సంతకం పెట్టలేదని మాట్లాడం సరికాదు..
మనిషికి భక్తి ఉందో లేదా అనేది ముఖ్యం..
జగన్మోహన్ రెడ్డి ఒక్క తిరుపతి నే కాదు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు..
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకోనే చంద్రబాబు పులిష్ గా మాట్లాడుతున్నారు..
కనకదుర్గమ్మ వారి భూములను నీకు నచ్చిన వారికి ఇచ్చుకోలేదా..
దుర్గమ్మ గుడిలో క్షద్ర పూజలు చేయించింది నువ్వు కదా..
తిరుమలలో పోటును తవ్వించింది నువ్వు కదా..
తిరుపతి లో సంతకం అనేది జగన్మోహన్ రెడ్డి వ్యక్తి గతం..
ప్రజలకు హామీ ఇచ్చిన సంతకం అమలు చేయకపోతే తప్పు..
నువ్వు చేసిన సంతకాలు పరిస్థితి ఏమిటో చంద్రబాబు సమాధానం చెప్పాలి..
రుణమాఫీ, డ్వాక్రా, బెల్ట్ షాపులు, బంగారం ఇంటికి తెస్తామని అనేక సంతకాలు చంద్రబాబు చేశారు..
ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క సంతకాన్ని చంద్రబాబు అమలు చేయలేదు..
నీచ సాంస్కృతికి చంద్రబాబు విష వృక్షం..
జగన్మోహన్ రెడ్డికి సంబందం లేని విషయాలను చంద్రబాబు మాట్లాడుతున్నారు..
ఎన్టీఆర్ పై రాయలేని భాషలో మాట్లాడింది చంద్రబాబు కదా
విష సంస్కృతికి మూల పురుషుడు చంద్రబాబు..
జగన్మోహన్ రెడ్డి కుటంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు సోసిల్ మీడియాలో రాతలు రాయించావు..
టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటంబ సభ్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారు..
ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు..
లోక కల్యాణం కోసం జగన్మోహన్ రెడ్డి యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుకుంటునట్లు చంద్రబాబు అభివృద్ధి ని అడ్డుకుంటున్నారు..
ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు ప్రతినిత్యం బురద జల్లుతున్నారు..
చంద్రబాబు తన కోవర్ట్ లను బీజేపీలోకి పంపారు..
చంద్రబాబు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోలేదు..
ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వమే లిక్కర్ షాప్ లను నడిపింది..
సీఎం మోడీని కలిస్తే కేసులు కోసమని చంద్రబాబు మాట్లాడుతారా..
మోడీని కూడా దిగజార్చే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు..
చంద్రబాబు విమర్శలుపై బీజేపీ నాయకులు స్పందించాలి..
టీడీపీ అనేది ముగిసిన అధ్యయనం..
పోలవరం ను ఎటిఎంలా మార్చుకున్నారని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ నే చెప్పారు..

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...