మెగాస్టార్ చిరంజీవి లైఫ్ టైమ్ మూవీగా పేర్కొంటున్న 'సైరా' చిత్రంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర్య పోరాటాన్ని వెండితెరపై చూస్తుంటే ఒళ్లు గగుర్పొడించిందని తెలిపారు. తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చిన చిత్రంగా 'సైరా'ను అభివర్ణించారు.
'సైరా' సినిమా చిరంజీవి 12 ఏళ్ల కలకు ప్రతిరూపం అని, ఆయన తన స్వప్నాన్ని అద్భుతమైన రీతిలో సాకారం చేసుకున్నారని లోకేశ్ కితాబిచ్చారు. అంతేకాదు, చిరంజీవికి హ్యాట్సాఫ్ చెప్పారు. చిత్రయూనిట్ కు తన అభినందనలు తెలియజేశారు. ఎంతో కష్టపడి, 'సైరా' చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, ఘనవిజయాన్ని అందుకున్న నిర్మాత రామ్ చరణ్ కు, దర్శకుడు సురేందర్ రెడ్డికి, ఇతర టెక్నీషియలన్లు, యూనిట్ సభ్యులకు హార్దికాభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

Comments
Post a Comment