ప్రతిపక్ష టీడీపీ ఎంతగా విమర్శిస్తున్నా రివర్స్ టెండరింగ్‌తో ముందుకు వెళ్లాలనుకుంటున్న జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పోలవరం టెండర్లలో మరోదాన్ని రద్దు చేసింది. ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి ప్యాకేజీ-5లో 65 కోట్ల రూపాయల విలువైన పనులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పీఎస్కే-హెచ్‌ఈఎస్ ఇన్ఫ్రా కంపెనీలు ప్రస్తుతం చేస్తున్న పనులకు అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేయనుంది. అనంతరం కొత్త ఏజెన్సీలకు పనులు అప్పగించేందుకు వీలుగా టెండర్ ప్రక్రియను నిర్వహించనుంది.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment