ఢిల్లీ: రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుక్రవారం జరిపిన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాలపాటు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి 22 అంశాలపై లేఖలు ఇచ్చారు. అభివృద్ధిపథకాలు, పలు సంక్షేమ పథకాలతోపాటు, ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణకు సహకరించాలని కోరారు. ఇందులో ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లు ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా 450 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉందని, గత ఐదేళ్లలో నాలుగుసార్లు విడుదలయినప్పటికీ ఒక ఏడాది కి సంబంధించిన నిధులు ఇంకా విడుదల కాలేదని పేర్కొన్నారు. ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రధానమంత్రికి సీఎం కేసీఆర్ ఇచ్చిన లేఖల్లోని మరికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
-నేషనల్ హై వేస్ అధారిటీ సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్‌ఆఫ్ ఇండియా పరిశ్రమను పునరుద్దరించాలి.
-తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచాలి.
-తెలంగాణలో ఐఐఎంను నెలకొల్పాలి.
-తెలంగాణకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఇఆర్)మంజూరు చేయాలి.
-హైదరాబాద్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడి)ని ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో నెలకొల్పాలని ప్రతిపాదించిన ఎన్‌ఐడిని రాష్ట్ర పునర్విభజన తర్వాత విశాఖపట్నానికి తరలించారు.
-అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయం మేరకు తెలంగాణలో మరో 23 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
-రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలి. రైల్వే పనులకు అవసరమైన నిధులను విడుదల చేయాలి.
-నీతి ఆయోగ్ సిఫారసులకు అనుగుణంగా మిషన్ కాకతీయ పథకానికి రూ. 5,000 కోట్లు, మిషన్‌భగీరధకు రూ.19,205 కోట్లు విడుదల చేయాలి.
-బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలి.
-జహీరాబాద్ నిమ్జ్‌కు నిదులను విడుదల చేయాలి.
-తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన మేరకు, రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ చేపట్టాలి.
-పిపిపి పద్దతిలో కరీంనగర్‌లో ఐఐఐటి నెలకొల్పాలి.
-తెలంగాణలో రిజర్వేషన్లు పెంచాలి. ముస్లిలలోని వెనుకబడిన కులాలకు 12శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం బిసిలకు 37శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
-పార్లమెంట్‌లో, అసెంబ్లీలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.
-హైదరాబాద్- నాగపూర్, వరంగల్- హైదరాబాద్ ఇండస్ర్టియల్ కారిడార్‌ను అభివృద్ధి పర్చాలి.
-వెనుకబడిన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కోసం పిఎంజిఎస్‌వై ద్వారా 4 వేల కోట్ల రూపాయలు కేటాయించాలి.
-వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చే పట్టే రహదారుల పనులకు 60ః40 నిష్పత్తిలో కాకుండా వందశాతం ఖర్చు కేంద్రమే భరించాలి.
-సెంట్రల్‌యూనివర్శిటీ తరహాలో పూర్తి కేంద్ర ఖర్చుతో వరంగల్‌లో గిరిజన యూనివర్శిటీని నెలకొల్పాలి.
-వరంగల్ టక్స్‌టైల్ పార్కు కోసం వెయ్యికోట్ల రూపాయలను గ్రాంట్ ఇన్‌ఎయిడ్‌గా అందించాలి.
-రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలి.
-వరద కాలువకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదల చేయాలి.
Comments
Post a Comment