Skip to main content

మన హెలికాప్టర్ ను మన క్షిపణే బలిగొంది!... అసలు విషయాన్ని బయటపెట్టిన వాయుసేన చీఫ్

పుల్వామా దాడులకు ప్రతీకారంగా పీవోకేలోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ భీకర వైమానిక దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జమ్మూకశ్మీర్ లోని బద్దాం ప్రాంతంలో ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వాయుసేన సిబ్బంది, ఓ సాధారణ పౌరుడు మృతి చెందారు. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయిందని, పాక్ క్షిపణి దాడిలో కుప్పకూలిందని భిన్న వాదనలు వినిపించాయి. కానీ, ఇటీవలే కొత్తగా వాయుసేన ఎయిర్ చీఫ్ మార్షల్ గా బాధ్యతలు స్వీకరించిన ఆర్కే భదౌరియా అసలు విషయాన్ని వెల్లడించారు.

ఆ వేళ బద్గాంలో క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్నారని, అయితే ఎంఐ-17 హెలికాప్టర్ ను పాక్ కు చెందినదిగా భావించి పొరబాటున క్షిపణిని దానిపైకి సంధించారని భదౌరియా వివరించారు. ఈ దుర్ఘటనకు కారకులైన అధికారులపై న్యాయపరమైన విచారణ పూర్తిచేశామని, వారిపై కఠినచర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మున్ముందు ఇలాంటి ఘోరతప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడతామని తెలిపారు.

Comments

Popular posts from this blog

Android ఫోన్లలో బ్యాంక్ అకౌంట్ వివరాలు దోచుకునే కొత్త మాల్వేర్ 'BlackRock' హడలెత్తిస్తోంది

Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స్మార్ట్ ఫోన్ల నుండి వినియోగదారుల విలువైన బ్యాంక్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బయటపడింది. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు సాగుతోంది. ఒక మాల్వేర్, బ్యాంక్ అకౌంట్ ఆధారాలను మరియు క్రెడిట్ కార్డు వాటి వాటి వివరాలను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల ద్వారా సేకరిస్తున్నట్లు మరియు ఇది దాదాపుగా 300 పైగా ఆండ్రాయిడ్ యాప్స్ పైన తాన్ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలిపింది. అసలే ప్రజలు కరోనా మహమ్మారితో దెబ్బకి హడలెత్తి పోతోంటే, ఆన్ లైన్ లో సైబర్ దాడులు మరియు సైబర్ మోసాలు మరింతగా కృంగదీస్తున్నాయి. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు  సాగుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం,Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స...

ఆమిర్‌ ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్న నెటిజెన్లు

  బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, తన తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ కోసం ఆమిర్ ఇటీవల టర్కీకి వెళ్లారు. ఈ సమయంలో ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడి వారు ఉత్సాహం చూపారు. తన పర్యటనలో భాగంగా టర్కీ అధ్యక్షుడి భార్య ఎమినే ఎర్డోగన్ ను కూడా ఆమిర్ కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపారు. ప్రముఖ భారతీయ నటుడు ఆమిర్ ను కలవడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. టర్కీలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారని.. ఆ చిత్రాన్ని చూసేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు. ఈ వ్యవహారంపై ఆమిర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు టర్కీ అధ్యక్షుడు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమినేను ఆమిర్ కలవకుండా వుండి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.