Skip to main content

ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద మూడు మృతదేహాలు... బోటు ప్రమాదంలో గల్లంతైన వారివిగా భావిస్తున్న అధికారులు

కొన్ని రోజుల కిందట తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునక ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మృత్యువాత పడడమే కాకుండా, అనేకమంది గల్లంతయ్యారు. ఇప్పటికీ కొంతమంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో, ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్దకు ఇవాళ మూడు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఆ మృతదేహాలను వెలికితీయించిన అధికారులు జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించారు. ఆ మృతదేహాలను బోటు ప్రమాదంలో గల్లంతైన వారివిగా భావిస్తున్నారు. బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆ మృతదేహాలను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం అవి ఎవరి మృతదేహాలన్నది గుర్తించే అవకాశాలున్నాయి. ఈ మేరకు గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించనున్నారు.

Comments