బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆయన ఆదివారం ముంబైలోని నానావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు.
అమితాబ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు. చివరిగా నిర్వహించిన కరోనా టెస్టులో ఆయనకు నెగెటివ్ వచ్చింది. దాంతో అమితాబ్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్టు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారని వివరించారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అభిషేక్ తన ట్వీట్ లో పేర్కొన్నారు తన విషయం గురించి చెబుతూ, ఇతర లక్షణాల కారణంగా తాను కొంతకాలం ఆసుపత్రిలో ఉండాల్సి వస్తోందని మరో ట్వీట్ లో తెలిపారు. ఇప్పటికీ తనకు కరోనా పాజిటివ్ అనే వస్తోందని వివరించారు.నేను దీన్ని ఓడించి ఆరోగ్యంగా తిరిగి వస్తాను! ప్రామిస్. అంటూ ట్వీట్ చేసారు
Comments
Post a Comment