Skip to main content

ఐపీఎల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. తేదీలు, టైమింగ్స్ ఖరారు..


IPL 2020అంతా అనుకున్నట్లే జరుగుతోంది. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపధ్యంలో యూఏఈ వేదిక ఐపీఎల్ 13వ సీజన్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరగనుంది. విదేశీ గడ్డపై ఐపీఎల్ జరగడం ఇది మూడోసారి. గతంలో 2009లో దక్షిణాఫ్రికాలో, 2014లో పాక్షికంగా యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి.

ఇక ఈసారి విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణ కత్తి మీద సాము అనే చెప్పాలి. కరోనా వైరస్ వ్యాప్తి ఉన్న నేపధ్యంలో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసిజర్‌ (ఎస్‌ఓపీ)లోని నిబంధనలు పాటిస్తూ బయోసెక్యూర్ వాతావరణంలో ఈ లీగ్‌ను నిర్వహించాల్సి ఉంది. పూర్తి షెడ్యూల్‌ను వారంలో ఖరారు చేయనుండగా.. మొత్తం 53 రోజుల ఐపీఎల్ 2020 టోర్నమెంట్‌లో 10 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉండనుండగా.. సాయంత్రం మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకే మొదలు కానున్నాయి. కాగా, ఈ 13 సీజన్‌లలో మొదటిసారిగా ఐపీఎల్ ఫైనల్ వీక్ డేలో జరగనుంది.

Comments