Skip to main content

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రించిన అలీ..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందనే వచ్చింది. ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు చాలా మంది ఈ ఛాలెంజ్‌ ను స్వీకరించారు.

తాజాగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు కమెడియన్ అలీ. బక్రీద్ పండుగను పురస్కరించుకొని మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మణికొండలోని తన ఇంటి పరిసర ప్రాంతాలలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు అలీ. అనంతరం ఆయన ఈ ఛాలెంజ్‌ను సినీ ఆర్టిస్ట్ ఖయుమ్, ఆయన బావమరిది కరీంకు విసిరారు. అదేవిధంగా యువతీ యువకులను పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఈ యొక్క గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఇదేవిధంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Comments