ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి
కరోనా వైరస్ సోకింది. ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.
కోన రఘుపతితో పాటు భార్య, కుమార్తెకు కూడా కోవిడ్ నిర్థారణ అయింది. ఈ
విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశారు డిప్యూటీ
స్పీకర్ కోన రఘుపతి. వీడియోలో స్పీకర్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు జ్వరం
రావడంతో కరోనా టెస్టులు చేయించాం. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. దీనికి
కంగారు పడాల్సిన పనిలేదు. వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని
వైద్యులు సూచించినట్లు చెప్పారు. దీంతో నేను ప్రభుత్వ కార్యక్రమాలను
వాయిదా వేస్తున్నాను. నేను ప్రస్తుతం ధైర్యంగా ఉన్నాను. కేవలం మాకు
మైల్డ్ లక్షణాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. వారం
రోజుల్లోనే మళ్లీ కలుద్దాం’. అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
Comments
Post a Comment